కరోనా బారిన పడ్డ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

కరోనా బారిన పడ్డ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్  ద్వారా తెలిపారు. " కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. మీ ఆశీర్వాదంతో త్వరలో కరోనాను ఓడిస్తాను. నాతో కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ వెంటనే పరీక్షలు చేయించుకోవాలి" అని పవార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

62 సంవత్సరాలున్న పవార్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. అంతకుముందు 2020 అక్టోబర్ లో ఆయనకు మొదటిసారి కరోనా సోకింది. గతవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీలకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

కోష్యారీ ఆసుపత్రిలో చేరి కోలుకోని నిన్న(ఆదివారం) డిశ్చార్జ్ అయ్యారు. ఉద్దవ్ ఠాక్రే తన నివాసం మాతోశ్రీ నుండే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక మహారాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆదివారం రోజున కొత్తగా 6,493 కరోనా కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు.