ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ లీడర్అజిత్పవార్కు చెందిన దాదాపు రూ.1,400 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. గత నెలలో ముంబై, ఢిల్లీ, పుణె, గోవాతో పాటు మహారాష్ట్రలో పవార్బంధువుల ఇండ్లల్లో సెర్చ్‌చేసిన ఐటీ డిపార్ట్మెంట్తాజాగా ఆ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు పవార్‌కు లెటర్పంపింది. అటాచ్ చేసిన ఆస్తులు చట్టబద్ధంగా సంపాదించినవేనని 90 రోజుల్లో పవార్ రిలేటివ్స్నిరూపించుకోవాలని ఐటీ శాఖ చెప్పింది. దర్యాప్తు కొనసాగుతున్నంత వరకు ఆ ఆస్తులను అమ్మకూడదంది. ఐటీ డిపార్ట్మెంట్అటాచ్చేసిన ఆస్తుల్లో రూ. 600 కోట్ల విలువైన సతారాలోని జరందేశ్వర్షుగర్ఫ్యాక్టరీ, రూ. 250 కోట్ల విలువైన గోవాలోని నిలయ రిసార్ట్, రూ.25 కోట్ల విలువైన దక్షిణ ముంబైలోని నిర్మల్హౌస్లో ఉన్న పార్థ్పవార్ (అజిత్కొడుకు) ఆఫీస్, దక్షిణ ఢిల్లీలోని రూ.20 కోట్ల విలువైన ఫ్లాట్, మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లోని రూ.500 కోట్ల విలువైన భూములు ఉన్నాయి. గత నెలలో పవార్బంధువుల ఇండ్లల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ.. లెక్కకు రాని రూ.184 కోట్ల ఆస్తులను గుర్తించింది.
