ఆరోగ్యంగా జీవించటం ఖైదీల హక్కు…వారికి కరోనా సోకకుండా చర్యలు తీసుకోండి

ఆరోగ్యంగా జీవించటం ఖైదీల హక్కు…వారికి కరోనా సోకకుండా చర్యలు తీసుకోండి
  • మహారాష్ట్ర సర్కార్ కు హైకోర్టు ఆదేశం

ముంబై : ముంబైలోని ఆర్థూర్ రోడ్ జైల్లో ఖైదీలకు కరోనా సోకటంపై మహారాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జైల్లో ఉన్న ఖైదీలకు ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంటుందని…వారి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిచంటమేమిటనీ ప్రశ్నించింది. జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా సోకిన వారందరికీ మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని ప్రభుత్వానికి సూచించింది. ఒక్క అర్ధూర్ రోడ్ జైళ్లోనే 77 మంది ఖైదీలు, 27 మంది జైలు అధికారులు కరోనా బారిన పడ్డారు. అటు పోలీసులు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందికి కరోనా సోకటంపై హైకోర్టు అంతసృప్తి వ్యక్తం చేసింది. కోరనా వారియర్స్ కు కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాట్లు చేయాలని తెలిపింది. మహారాష్ట్ర లో దాదాపు 7 వందల మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. దేశంలోనే కరోనా కేసుల్లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. ఇప్పటికే దాదాపు 19 వేలకు పైగా జనం కరోనా బారిన పడ్డారు.