మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఇవాళ (సోమవారం)న రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తన రాజీనామా లేఖను ఆయన  సీఎం ఉద్ధవ్ థాకరేకు పంపించారు. ముంబై పోలీసు మాజీ చీఫ్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ జరపాలని ముంబై కోర్టు హైకోర్టు సీబిఐ ఆదేశించింది. సీబీఐ ఆదేశాలతో అనిల్ దేశ్ ముఖ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. తాను ఏ విధమైన తప్పు చేయలేదంటూ రాజీనామా చేయాలనే డిమాండ్ ను ఆయన చాలా కాలంగా తిరస్కరిస్తూ వచ్చారు. ఇటీవల ఆయనపై ముంబై మాజీ  పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్  చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన క్రమంలో తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల వాహనం కేసులో అరెస్టైన సచిన్ వాజేకు..దేశ్ ముఖ్ ప్రతీనెల బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టినట్లు పరమ్ బీర్ ఆయనపై ఆరోపణలు చేశారు.అప్పటి నుంచి కూడా రాజీనామా చేయాలని అనిల్ దేశ్ ముఖ్ పై ఒత్తిడి వస్తూనే ఉంది.