ముంబైలో భారీ వర్షాలు..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

ముంబైలో భారీ వర్షాలు..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

ముంబైని మరోసారి భారీ   వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వాన ముంబై వణికిపోయింది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ముంబై మహానగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురుకృపా, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీళ్లు నిలిచాయి. షణ్ముక్ నంద హాల్ రోడ్డు నీట మునిగింది. ఎవరార్డ్ నగర్, హనుమాన్ నగర్, పనవేల్, వాసీ, మాన్ ఖూర్, జీటీపీ నగర్, గాంధీ మార్కెట్ ఏరియాల్లో భారీ వర్షం పడింది. సియాన్ రైల్వే స్టేషన్ లో.. వరద నీరు ట్రాక్ మీదకు చేరింది. ప్లాట్ ఫాం ఎత్తు వరకు వరదనీరు వచ్చింది.

లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. అర్థరాత్రి భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందేరీ, బోరివాలి ప్రాంతాల్లో జనం నిద్రపోకుండా.. ఇళ్లల్లోని నీళ్లు ఎత్తిపోసుకున్నారు. వాటర్ లాగింగ్ ఏరియాల్లో భారీగా నీళ్లు నిలవడంతో.. హైవేలపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. బోరివాలి ఈస్ట్ ఏరియా ప్రాంతంలో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి.-