ఒక్క రోజులో 139 క‌రోనా మ‌ర‌ణాలు

ఒక్క రోజులో 139 క‌రోనా మ‌ర‌ణాలు

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ప్ర‌తి రోజూ భారీగా కొత్త కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 2,436 మంది క‌రోనా పాజిటివ్ వ‌చ్చాయి. ఈ ఒక్క రోజులోనే 139 మందిని క‌రోనా మ‌హ‌మ్మారి బ‌లి తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రోజులో న‌మోదైన అత్య‌ధిక మ‌ర‌ణాల సంఖ్య ఇదే. తాజా కేసుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లో మొత్తం క‌రోనా కేసులు 80,229కి చేరాయ‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం రాత్రి వెల్ల‌డించింది. అందులో 2,849 మంది మ‌ర‌ణించ‌గా.. 35,156 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం 42,224 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది.

మ‌హారాష్ట్ర‌లో మొత్తం క‌రోనా కేసుల్లో స‌గానికి పైగా ఒక్క ముంబైలోనే న‌మోద‌య్యాయి. ముంబై సిటీలో ఇవాళ 1149 కొత్త కేసులు న‌మోదు కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 46,080కి చేరింది. ముంబైలో 1519 మంది మ‌ర‌ణించ‌గా.. 18,778 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 25,783 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ముంబై త‌ర్వాత థానేలో 11,877, పుణేలో 9051 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.