
మహారాష్ట్రలో జులై 1వ తేదీ శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవదహనమయ్యారు. యావత్ మాల్ నుంచి పూణే వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద బస్సులో అకస్మా్త్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సులోని 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. బస్సులో మంటలు వ్యాపించిన సమయంలో కొంత మంది బయటకుదూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.