బస్సులో ఉరేసుకున్న ఆర్టీసీ డ్రైవర్

V6 Velugu Posted on Sep 21, 2021

ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. డ్యూటీలో ఉన్న బస్సు డ్రైవర్.. అదే బస్సులో ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషాద ఘటన అహ్మద్‌నగర్ జిల్లాలోని సంగమ్నర్ డిపో వద్ద జరిగింది. సుభాష్ టెలోర్ అనే వ్యక్తి మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్‎కు చెందిన బస్సు డ్రైవర్. ఆయన పఠార్ది నుంచి నాసిక్ వరకు బస్సు నడిపేవాడు. అయితే విధులలో భాగంగా టెలోర్ మంగళవారం ముంబైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమ్నర్ డిపోలో నైట్ హాల్ట్ చేయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న టెలోర్.. బస్సులోనే ఒక రాడ్‎కు ఉరేసుకొని చనిపోయాడు. మరుసటి ఉదయం గమనించిన తోటి సిబ్బంది.. పై అధికారులకు తెలిపారు. 

కాగా.. మహారాష్ట్రలో బస్సు డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండోసారి. గత నెలలో కమలేష్ బెడ్సే (44) అనే డ్రైవర్ అప్పులు మరియు తక్కువ జీతం కారణంగా ధూలేలో ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Tagged Maharashtra, suicide, RTC driver, MSRTC, Bus driver suicide, Sangamner depot, Ahmednagar district

Latest Videos

Subscribe Now

More News