
పుణె: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీకి మహారాష్ట్ర జట్టును ప్రకటించారు. టీమిండియా బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షాను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు 17 మందితో కూడిన టీమ్‌ను సెలెక్టర్లు గురువారం ఎంపిక చేశారు. ముంబైని వీడిన తర్వాత పృథ్వీకి ఇది తొలి అసైన్‌మెంట్ కానుంది. క్రమశిక్షణ, ఫిట్‌నెస్ సమస్యలతో మ్యాచ్‌లకు దూరమైన పృథ్వీ మళ్లీ గాడిలో పడాలని భావిస్తున్నాడు. మహారాష్ట్ర తరఫున రాణించి టీమిండియాలో చోటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇండియా–ఎ తరఫున ఇంగ్లండ్ టూర్‌లో ఆడిన రుతురాజ్ కూడా తన సత్తా చూపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే తొలి మ్యాచ్ తర్వాత రుతురాజ్, వికెట్ కీపర్ సౌరభ్ నవాలె.. వెస్ట్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీలో ఆడేందుకు వెళ్లనున్నారు. ఇప్పటికే వెస్ట్ జోన్‌కు సెమీస్‌లో ఆడేందుకు డైరెక్ట్ ఎంట్రీ లభించింది. సెప్టెంబర్ 4 నుంచి ఈ మ్యాచ్ జరగనుంది.
మహారాష్ట్ర జట్టు: అంకిత్ బావ్నే (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సిద్ధేష్ వీర్, సచిన్ దాస్, అర్షిన్ కులకర్ణి, హర్షల్ కేట్, సిద్ధార్థ్ మాత్రే, సౌరభ్ నవాలె, మందార్ భండారి, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ దధే, వికీ ఒస్వాల్, హితేశ్ వాలుంజ్, ప్రశాంత్ సోలంకీ, రాజవర్ధన్ హంగర్గేకర్.