V6 News

షాకింగ్.. లవ్ ట్రాప్లో 180 మైనర్లు.. 350 వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

షాకింగ్.. లవ్ ట్రాప్లో 180 మైనర్లు.. 350 వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

స్నాప్ చాట్ ద్వారా మైనర్లను అట్రాక్ట్ చేయడం.. వారితో ఫ్రెండ్ షిప్ చేయడం.. లేని పోని ఆశలు చూపడం.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం. మహారాష్ట్రలో సంచలనంగా మారిన కేసు ఇది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 180 మంది మైనర్లను బ్లాక్ మెయిల్ చేసి ఘటనలో 19 ఏళ్ల టీనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని అమరావతిలో మొహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 180 మంది మైనర్లను ట్రాప్ చేసి 350 వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు బీజేపీ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమరావతిలో తన్వీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరాట్వాడా సిటీకి చెందిన తన్వీర్.. ముంబై, పుణేకు చెందిన మైనర్లను లవ్ ట్రాప్ చేసి అసభ్యకరమైన వీడియోలు తీసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మొదట్లో పరిచయం చేసుకుని.. లవ్ చేస్తున్నట్లు నటించడం తన్వీర్ స్పెషల్. అలా లవ్ ట్రాప్ లో పడేసి..  మైనర్ల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఆ తర్వాత వ్యభిచారంలోకి దించేందుకు ఒత్తిడి చేస్తాడు. చెప్పిన మాట వినకుంటే వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తాడు. అలా కొన్ని వీడియోలు రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. 

వాట్సాప్, స్నాప్ చాట్:

మైనర్లను ప్లాన్ ప్రకారం.. వాట్సాప్, స్నాప్ చాట్ లలో ట్రాప్ చేస్తుంటాడు. ఆ తర్వాత వారిని మానసికంగా లోబరుచుకుని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తాడని రాజ్యసభ ఎంపీ అనిల్ బొండే ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితునిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. 

మొహమ్మద్ అయాజ్ ఎంఐఎం (AIMIM) పార్టీ కార్యకర్తగా ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అమరావతి ఎంఐఎం ప్రెసిడెంట్ హాజీ ఇర్ఫాన్ ఖాన్ చేతుల మీదుగా లెటర్ గ్రహించిన ఫోటోలు, రీల్స్ వైరల్ చేస్తున్నారు. కేసు రిజిస్టర్ అయ్యాక ఆ వీడియోలు ప్రస్తుతం ఇన్ స్టా అకౌంట్ నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు. అయాజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7 రోజుల రిమాండ్ కు తరలించారు.