- బతికున్న వ్యక్తికి థానె మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫోన్
థానె: మహారాష్ట్రలోని ఓ స్కూల్ టీచర్‌కి వింత అనుభవం ఎదురైంది. ‘మీ డెత్ సర్టిఫికెట్ రెడీ అయింది.. ఆఫీసుకొచ్చి తీసుకుపోండి’ అంటూ థానె మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫోన్ రావడంతో ఘట్కోపర్లో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ దేశాయ్(58) అవాక్కయ్యాడు. పోయినేడుదేశాయ్ కరోనా బారిన పడి, ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్నడు. అయితే, మున్సిపల్ రికార్డుల్లో మాత్రం ఆయన చనిపోయినట్లు రికార్డయింది. దాని ఫలితమే ఈ ఫోన్‌కాల్.. దీంతో తాను బతికే ఉన్నట్లు నిరూపించుకోవడానికి దేశాయ్ థానెమున్సిపల్ ఆఫీసుకు పరుగుపెట్టిండు.
