
న్యూఢిల్లీ: కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో జరిగిన ప్యాసింజర్ వెహికల్ (పీవీ–కార్లు, బస్సులు వంటివి) అమ్మకాల్లో మహారాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించగా, టూ-వీలర్ సేల్స్‌లో ఉత్తర ప్రదేశ్ టాప్‌లో నిలిచిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ప్రకటించింది.
ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ)
మహారాష్ట్రలో 5,06,254 యూనిట్స్ సేల్ అయ్యాయి (మొత్తం పీవీ అమ్మకాల్లో11.8 శాతం వాటా), రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్ (4,55,530 యూనిట్స్, 10.6 శాతం వాటా), మూడో స్థానంలో గుజరాత్ (3,54,054 యూనిట్స్, 8.2 శాతం), నాల్గో స్థానంలో కర్ణాటక (3,09,464 యూనిట్స్, 7.2 శాతం), ఐదో స్థానంలో హర్యానా ( 2,94,331 యూనిట్స్, 6.8శాతం) ఉన్నాయి.
టూ-వీలర్స్
కిందటి ఆర్థిక సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్‌లో 28,43,410 టూవీలర్ బండ్లు సేల్ అయ్యాయి. మొత్తం అమ్మకాల్లో 14.5 శాతం ఈ రాష్ట్రంలోనే జరిగాయి. మహారాష్ట్ర రెండో స్థానంలో (20,91,250 యూనిట్స్,10.7 శాతం), తమిళనాడు మూడో స్థానంలో (14,81,511 యూనిట్స్, 7.6 శాతం), కర్ణాటక నాల్గో స్థానంలో (12,94,582 యూనిట్స్, 6.6 శాతం), గుజరాత్ ఐదో స్థానంలో (12,90,588 యూనిట్స్, 6.6శాతం) ఉన్నాయి.
కమర్షియల్ వెహికల్స్ (సీవీ)
కమర్షియల్ వెహికల్ అమ్మకాల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. ఈ రాష్ట్రంలో 2024–25 లో 1,34,044 బండ్లు అమ్ముడయ్యాయి. మొత్తం సీవీ సేల్స్‌లో ఈ రాష్ట్రం వాటా 14 శాతంగా ఉంది. ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో (89,126 యూనిట్స్, 9.3 శాతం), గుజరాత్ మూడో స్థానంలో (82,433 యూనిట్స్, 8.6శాతం), తమిళనాడు నాలుగో స్థానంలో (70,567 యూనిట్స్, 7.4 శాతం), కర్ణాటక ఐదో స్థానంలో (69,903 యూనిట్స్, 7.3 శాతం) ఉన్నాయి.
త్రీ-వీలర్స్
త్రీ వీలర్ సేల్స్‌లో యూపీ టాప్‌లో ఉంది. ఈ రాష్ట్రంలో 93,865 యూనిట్స్ (12.7 శాతం వాటా) సేల్ అయ్యాయి. గుజరాత్ రెండో స్థానంలో (83,947 యూనిట్స్,11.3శాతం), మహారాష్ట్ర మూడో స్థానంలో (83,718 యూనిట్స్, 11.3శాతం), కర్ణాటక నాలుగో స్థానంలో (70,417 యూనిట్స్, 9.5శాతం), బిహార్ ఐదో స్థానంలో (47,786 యూనిట్స్, 6.4శాతం) ఉన్నాయి.