ఓ చేతిలో గొడుగు.. మరో చేతిలో స్టీరింగ్.. ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్..

ఓ చేతిలో గొడుగు.. మరో చేతిలో స్టీరింగ్.. ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్..

మన ఆర్టీసీ బస్సులు ఎలా ఉన్నాయి.. మన ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఎలా నడుపుతున్నారు అనటానికి ఈ స్టోరీ ఎగ్జాంపుల్.. ఈ ఫొటోలు సజీవ సాక్ష్యం.. వర్షం వస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కుతాం.. ఇక్కడ రివర్స్.. ఆర్టీసీ బస్సులోనే వర్షం పడుతుంది. మనం నడిస్తే తడిచాం.. ఆర్టీసీ డ్రైవర్ తొందరగా తీసుకెళితే అదే చాలు అనుకుంటాం.. ఇక్కడ అలాంటి సీన్ లేదు.. ఆర్టీసీ డ్రైవరే ఓ చేతిలో గొడుగు.. మరో చేతిలో స్టీరింగ్ పట్టకుని డ్రైవింగ్ చేస్తున్నాడు.. ఏంటీ నమ్మరా.. ఇదిగో ఈ ఫొటోలు చూడండి.. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షం పడుతుండగా ఓ ఆర్టీసీ బస్సు పైకప్పు ఇలా లీకవుతు కనిపించింది. ఆ సమయంలో   బస్సు డ్రైవర్   ఒక చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో బస్సును నడుపుతూ కనిపించాడు.  ఈ ఆర్టీసీ బస్సు  అహేరి డిపోకు చెందిన బస్సుగా చెబుతున్నారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  ప్రజారవాణా నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై  విమర్శలు వస్తున్నాయి. 

 సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో మంబై కాంగ్రెస్  ప్రభుత్వంపై,  మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC)పై విమర్శలు చేసింది.  ప్రయాణీకుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రయాణికుల భద్రతపై తీసుకున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

మహరాష్ట్రలోని చాలా జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఇలానే ఉంది.  పాడైన బస్సులు వాటి పరిస్థితులపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.  వర్షాకాలం కావడంతో  ఈ బస్సులు పదే పదే చెడిపోవడంతో ప్రయాణికులు,  సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, సాంగ్లీ ,బుల్దానా జిల్లాల నుండి వచ్చిన ఫుటేజీలు సోషల్ మీడియాలో వివాదాస్పదం అయ్యాయి.