
చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ అనగానే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ గుర్తొస్తాయి. ఇప్పుడు మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్.. చిరంజీవి సినిమా భోళా శంకర్‌కు మ్యూజిక్ ఇచ్చాడు. ఆగస్టు 11న ఈ మూవీ విడుదలవుతున్న సందర్భంగా మహతి స్వరసాగర్ ఇలా ముచ్చటించాడు.
‘‘చిరంజీవిగారితో సినిమా అని మెహర్ రమేష్ గారు చెబితే మొదట నమ్మలేదు. నిజం తెలిసి షాక్ అయ్యాను. నా కల నిజమైంది అనిపించింది. ఆయన గత సినిమాల సంగీతాన్ని పరిశీలించి.. నా నుంచి కొత్తగా ఏం చేయగలను అని ప్రిపేర్ అయ్యా. నాకంటూ ఓ యూనిక్ స్టైల్ ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటా. అందుకే నాన్న సలహాలు ఎక్కువగా తీసుకోను. కానీ ఈ సినిమాకు తప్పలేదు. ప్రతి ట్యూన్‌ను నాన్నగారికి వినిపించా. ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ‘ఎంత మాస్ సాంగ్ వున్నా మెలోడి ఉండాలి. అదే నిన్ను పదేళ్ళ తర్వాతైనా గుర్తిస్తుంది.
అది మిస్ కావద్దు’ అని చెప్పారు. చిరంజీవి గారి డాన్స్ మూవ్‌మెంట్స్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. మెగాస్టార్ గ్రేస్‌కు తగ్గట్టుగా మోడ్రన్ సౌండ్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. ‘మిల్కీ బ్యూటీ’ సాంగ్ ఐడియా చిరంజీవి గారిదే. మిగతావన్నీ మాస్ సాంగ్స్ కావడంతో నాన్న గారి శైలిలో మెలోడీ సాంగ్ చేయమని ఆయనే సూచించారు. అలా ప్రతి పాటలో చిరంజీవి గారి ఇన్‌పుట్స్ ఉన్నాయి. నాన్న కంపోజ్ చేసిన పాటల్లో ‘ఇంద్ర’లోని రాథే గోవిందా పాటను రీమిక్స్ చేయాలనుంది. అది కూడా రామ్ చరణ్‌కు మాత్రమే సూట్ అవుతుంది’’