- పాలమూరు ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు : బాలికలు కష్టపడి చదివి విద్యావంతులు కావాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆకాంక్షించారు. 'భేటీ బచావో-.. భేటీ పడావో' పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లా కేంద్రంలో మెట్టుగడ్డలో ఉన్న స్టేట్ హోమ్ ప్రాంగణంలో బాలికల కోసం నిర్మించిన కొత్త బాలసదన్ భవనాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రూ.1.34 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో బాలసదన్ భవనం నిర్మించినట్లు చెప్పారు.
అనాథ పిల్లలకు బాలసదన్ సొంత ఇల్లులా మారుతుందని, ఇక్కడ వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బాలసదన్ ద్వారా బాలికలకు సమతుల్యమైన ఆహారం, వైద్య పరీక్షలు, విద్య అందిస్తూ భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ర్ట నాయకురాలు పద్మజారెడ్డి పాల్గొన్నారు.
అవినీతిని అరికట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
చిన్నచింతకుంట, వెలుగు : ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. దేవరకద్ర మండలం ఫర్దిపూర్ గ్రామంలో నిర్వహించిన వికాసిత్ భారత్ జీ రామ్ జీ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను 100 నుంచి 125 రోజులకు పెంచామన్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గిస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
