ముంబై ఇండియన్స్‌‌‌‌ కు హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ జయవర్ధనే గుడ్‌‌‌‌ బై

ముంబై ఇండియన్స్‌‌‌‌ కు హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ జయవర్ధనే గుడ్‌‌‌‌ బై

ముంబై: ముంబై ఇండియన్స్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ పదవి నుంచి శ్రీలంక లెజెండ్‌‌‌‌ మహేల జయవర్ధనే తప్పుకున్నాడు. ఈ మేరకు శనివారం ఫ్రాంచైజీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. రెండు దఫాలుగా ముంబై జట్టుకు సేవలందించిన జయవర్ధనే హయాంలో ముంబై ఇండియన్స్‌‌‌‌ జట్టు మూడుసార్లు టైటిల్‌‌‌‌ను కైవసం చేసుకుంది. 2017 నుంచి 2022 వరకు తొలి విడత కోచ్‌‌‌‌గా వ్యవహరించిన అతను 2025 సీజన్‌‌‌‌కు ముందు మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు రెండేళ్ల పాటు గ్లోబల్‌‌‌‌ హెడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌గా పని చేశాడు. 

జయవర్ధనే ఐఎల్‌‌‌‌ టీ20, ఎంఐ ఎమిరేట్స్‌‌‌‌, మేజర్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ లీగ్‌‌‌‌లో ఎంఐ న్యూయార్క్‌‌‌‌, ఎస్‌‌‌‌ఏ టీ20లో ఎంఐ కేప్‌‌‌‌టౌన్‌‌‌‌ ఇతర ఫ్రాంచైజీల బాధ్యతలను కూడా పర్యవేక్షించాడు. 2026 మెగా లీగ్‌‌‌‌లో ముంబై ఇండియన్స్‌‌‌‌ 9వ ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకుంది. జయవర్ధనే అందించిన సేవలు చిరస్మరణీయమని ముంబై ఇండియన్స్‌‌‌‌ యజమాని నీతా అంబానీ పేర్కొంది. నవంబర్‌‌‌‌ 15న ఐపీఎల్‌‌‌‌ రిటెన్షన్‌‌‌‌ గడువు ముగియనున్న నేపథ్యంలో ముంబై జట్టు కొత్త కోచ్‌‌‌‌ను వెతికే పనిలో పడింది. డిసెంబర్‌‌‌‌ మధ్యలో గోవా వేదికగా ప్లేయర్ల వేలం జరగనుంది.