వెండితెర బద్దలే: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. SSMB29 పై రాజమౌళి బిగ్ అప్డేట్

వెండితెర బద్దలే: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. SSMB29 పై రాజమౌళి బిగ్ అప్డేట్

వరల్డ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో SSMB29 ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో అత్రుతతో ఎదురుచూస్తున్నారు.

అందులో మహేష్ బాబు ఫ్యాన్స్ ఐతే.. కళ్లకు ఒత్తులేసుకుని నిరీక్షిస్తున్నారు. అంతేకాదు..ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు గూగుల్లో తెగ జల్లెడ పట్టేస్తున్నారు. ఇక ఎట్టకేలకు వారి నిరీక్షణ ముగిసింది. 

ఇవాళ (ఆగస్టు 9) మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కీలక అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి కీలక ప్రకటన పోస్టు చేశారు. " ఇది అంతకుముందు ఎన్నడూ  చూడనటువంటిది" అని తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటో షేర్ చేశారు.

‘‘మేం SSMB 29 షూటింగ్‌ను ఇటీవలే స్టార్ట్ చేశాం. ఈ సినిమాపై ఉన్న మీ అందరి ఆసక్తి చూసి ఎంతో హ్యాపీగా ఉంది. మూవీ చాలా భారీస్థాయిలో తెరకెక్కుతుంది. కేవలం ప్రెస్‌మీట్‌ పెట్టి లేదా కొన్ని ఇమేజ్‌లు విడుదల చేయడం వల్ల స్టోరీకి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేము. దీన్ని భారీఎత్తున రూపొందిస్తున్నాం. నవంబర్‌ 2025లో మహేష్ లుక్‌ను రిలీజ్ చేస్తాం. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా దీన్ని రూపొందిస్తున్నాం. మీరంతా సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అని రాజమౌళి తన పోస్ట్లో వెల్లడించారు.