Mahesh Babu: SSMB29 కోసం.. ఫస్ట్ టైం కొడుకు బర్త్ డే మిస్.. మహేష్ ఎమోషనల్ పోస్ట్ !

Mahesh Babu: SSMB29 కోసం.. ఫస్ట్ టైం కొడుకు బర్త్ డే మిస్.. మహేష్ ఎమోషనల్ పోస్ట్ !

మహేష్ బాబు ఫ్యామిలీ అంటే తెలుగు ఫ్యాన్స్కి ఎప్పుడూ ప్రత్యేకమే. సూపర్ స్టార్ కృష్ణ దగ్గరి నుంచి మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ వరకు ఆ అభిమానం అలానే కొనసాగుతుంది. అంతేకాదు.. గౌతమ్ పూర్తిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని బలంగా కోరుకుంటూ వస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ క్రమంలోనే గౌతమ్ గురించి ఏ చిన్న అప్డేట్ వినిపించిన సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు సూపర్ ఫ్యాన్స్. 

లేటెస్ట్గా మహేష్ బాబు పెట్టిన పోస్ట్తో మరోసారి గౌతమ్ పేరు మార్మోగుతుంది. ఇవాళ (ఆగస్టు 31న) గౌతమ్‌ కృష్ణ 19వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుమారుడు గౌతమ్ని ఉద్దేశించి మహేష్ బాబు ఎమోషనల్ పోస్టు పెట్టారు. 

‘‘19వ వసంతంలోకి అడుగుపెట్టిన నా గౌతమ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నీ పుట్టిన రోజు మిస్ అవుతున్నాను. నీ బర్త్‌డేకి మిస్‌ కావడం ఇదే ఫస్ట్ టైం. నా ప్రేమ.. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలో ఇలాగే ప్రకాశిస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలని’’ తన కుమారుడు గౌతమ్కి మహేష్ ఆశీస్సులు అందించారు. ఈ పోస్ట్ చూసిన మహేష్ ఫ్యాన్స్.. గౌతమ్కు విషెష్ తెలియజేస్తున్నారు.

గౌతమ్ కృష్ణ సినీ విషయానికి వస్తే.. ఇప్పటికే నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు క్యారెక్టర్ లో గౌతమ్ నటించాడు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ పైన గౌతమ్ కృష్ణ పూర్తిస్థాయిలో ఫోకస్ చేశాడు. ప్రస్తుతం న్యూయార్క్ లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నాడు. అక్కడ చదువుతోపాటు నటనలోనూ శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. 

ప్రస్తుతం మహేష్ బాబు SSMB మూవీ షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మూడు భారీ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. త్వరలో  కొత్త షెడ్యూల్‌ను కెన్యా రాజధాని నైరోబి మరియు తూర్పు ఆఫ్రికాలో (టాంజానియా) ల్లో ప్లాన్‌ చేశారు జక్కన్న.