
సినీ నటుడు మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ కు GST అధికారులు షాకిచ్చారు. తగ్గిన GST రేట్లకు అనుగుణంగా టిక్కెట్ల రేట్లు తగ్గించకపోవడం సీరియస్ అయ్యారు. జనవరి 1 నుంచి 100 రూపాయలకు పైబడిన సినిమా టిక్కెట్లపై GSTని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. అయితే తగ్గించిన ధరలను AMB మల్టిప్లెక్స్ లో అమలు చేయకపోవడాన్ని గుర్తించారు GST అధికారులు. దీంతో ఆ మల్టిప్లెక్స్ కు నోటీసులిచ్చారు.
టిక్కెట్ల ధరలు తగ్గించకుండా సంపాదించిన ఆదాయాన్ని కన్జూమర్ వెల్ఫేర్ ఫండ్ కు చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని AMB మల్టిప్లెక్స్ యాజమాన్యానికి తెలిపారు GST అధికారులు. టాక్స్ విషయంలో పొరపాట్లు జరగకుండా ఉండే మహేష్ బాబు ..AMB విషయంలో జరిగిన దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది