Guntur kaaram Day 1 Collections: దుమ్ములేపిన రమణగాడు.. గుంటూరు కారం ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్

Guntur kaaram Day 1 Collections:  దుమ్ములేపిన రమణగాడు.. గుంటూరు కారం ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram). త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్న (జనవరి 12న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ఈగర్ గా వెయిట్ చేశారు. భారీ అంచనాలు మధ్య వచ్చిన గుంటూరు కారం సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. మహేష్ బాబు పక్కా మాస్ లుక్ లో అదరగొట్టినా.. కథ అంతగా లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

ఇక గుంటూరు కారం సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చినప్పటికీ.. రికార్డ్ నెంబరాఫ్ థియేటర్స్ లో రిలీజ్ అవడంతో మొదటిరోజు సూపర్ క్లలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు ఇండియా వైడ్ గా రూ.42 కోట్లు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. సంక్రాంతి సెలవులు కావడంతో ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. కానీ, అటు  హనుమాన్ కు యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

ఈ సినిమా ఎఫెక్ట్ గుంటూరు కారం కలెక్షన్స్ పడే అవకాశం ఉంది. ఇక 13, 14న సైంధవ్, నా సామిరంగ సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి. అందులో ఒక సినిమాకు హిట్ టాక్ వచ్చినా.. గుంటూరు కారంకు భారీ  ఎఫెక్ట్ పడుతుంది. ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. మహేష్ బాబుకు జోడీగా లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.