గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు..మహేష్ రేంజ్ ఇట్లుంటది

గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు..మహేష్ రేంజ్ ఇట్లుంటది

గుంటూరు కారం (GunturKaaram)నుంచి ఏ అప్డేట్ విన్నా..మహేష్ స్వాగ్ను ఊహించుకున్న భలే అనిపిస్తోంది ఫ్యాన్స్కి. ఇంకొంతమందికైతే..చూడగానే మజా వస్తుంది..హార్ట్ బీట్ పెరుగుతుంది..ఈల వేయాలి అనిపిస్తుంది! అంతే హుషారుగా గుంటూరు కారంకి సంబంధించిన ప్రతి విషయం పూనకాలు తెప్పిస్తోంది. 

ఇప్పటికే గుంటూరు కారం సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఈ స్థాయిలో జరుగుతున్నాయో తెలిసిందే. ఫ్యాన్స్ టికెట్స్ కోసం ఓ టికెట్ల పోరాటమే చేస్తున్నట్టుగా ఉంది.  ఈ సినిమాకు ఓవర్సీస్ లో బిజినెస్ పరంగ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మహేష్ బాబు కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ గుంటూరు కారం సినిమాకి జరిగినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. 

గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చూసుకుంటే..కేవలం బుకింగ్స్ ద్వారానే 1.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అని చెప్పుకోవాలి. 

అంతేకాదు ఈ సినిమాకి ఓవర్సీస్ లో 1792 ప్రీమియర్స్ షోలు పడుతున్నాయి. ఇదివరకు వచ్చిన రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రభాస్ సలార్, రాధేశ్యామ్ మూవీస్ తర్వాత..అలాంటి హైయెస్ట్ స్థానాన్ని గుంటూరు కారం సాధించింది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ..కచ్చితంగా టాలీవుడ్ చరిత్రలో..అలాగే మహేష్ సినీ కెరియర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్  సొంతం చేసుకోబోతున్న మూవీగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇప్పటివరకు గుంటూరుకారం వరల్డ్ వైడ్ ఓవరాల్ బిజినెస్ లెక్కలు చూస్తే రూ.134 కోట్ల వరకు జరిగింది. దీంతో ఈ కొత్త ఏడాదిలో గుంటూరు కారం మూవీ హైయెస్ట్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వస్తోన్న చిత్రంగా నిలవనుంది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉండనున్నాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.