నా కంటి రెప్పలో కాటుక ముగ్గు.. అబ్బబ్బా మెలోడి అదిరింది

నా కంటి రెప్పలో కాటుక ముగ్గు.. అబ్బబ్బా మెలోడి అదిరింది

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ గుంటూరు కారం (Gunturkaram). లేటెస్ట్గా గుంటూరు కారం సెకండ్ సింగిల్ ఓ మై బేబీ (OhMyBaby) సాంగ్  రిలీజ్ చేశారు మేకర్స్.

నా కాఫీ కప్పులో షుగర్ క్యూబ్..నువ్వే నువ్వే..నా కంటి రెప్పలో కాటుక ముగ్గు.. నువ్వే నువ్వే.. అంటూ క్యాచీ లైన్లతో ‘ఓ మై బేబీ’ సాంగ్ మొదలైంది. ఓ మై బేబీ..నీ బుగ్గలు పిండాలి..ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి..నా చున్నీ నీకు టై కట్టాలి” అంటూ సాగే పాటకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వినసొంపైన ట్యూన్ ఇవ్వగా..రామ జోగయ్య శాస్త్రీ అద్భుతమైన లిరిక్స్ అందించారు.ఈ పాటను శిల్పా రావు పాడారు.   

ఇప్పటికే రిలీజయిన ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా సాంగ్ తో ఆడియన్స్ కు రుచి చూపించారు త్రివిక్రమ్.ఇక ఓ మై బేబీ మెలోడియస్ లవ్ గీతానికి ప్రేమికులు ఫిదా కాకుండా ఉంటారా సుమా! ఈ మూవీలోని ప్రతి సాంగ్ వెనుక..ఏదో మ్యాజిక్ ఉంటుందని మేకర్స్ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో మహేష్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఫిక్స్ అయ్యారు. అన్ని సాంగ్స్ ని రుచి చూడటానికి.మరి డోస్ తగ్గదు కదా..

చాలా కాలం తరువాత మహేష్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ప్రతి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ప్రోమోలు, పోస్టర్స్ కూడా ఉండటంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. 

హారిక హాసిని క్రియేషన్స్(Harika hasini creations) పై చినబాబు (Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో..బ్యూటీ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి కానుక‌గా 12 జనవరి 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది.