మహేష్ బాబు న్యూ మూవీ.. టైటిల్ అప్ డేట్..

మహేష్ బాబు న్యూ మూవీ.. టైటిల్ అప్ డేట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. SSMB28 టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాత నాగవంశీ(Nagavamshi) అప్డేట్ ఇచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత మహేష్-త్రివిక్రమ్ కాంబో రానున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే.. మేకింగ్ లో కాంప్రమైజ్ కాకుండా.. ప్రతీ సీన్ ని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఉగాది కానుకగా రిలీజ్ చేసిన మహేష్ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ రిలీజ్ చేసాడు నిర్మాత నాగవంశీ.

ప్రతీ ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు సినిమాకు సంబంధించి  అప్డేట్ రావడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో  ఈ ఏడాది  మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా SSMB28  టైటిల్ అనౌన్స్ చేయనున్నారట. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

SSMB28 మూవీలో  పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ.. 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.