మహేష్ కొత్త సినిమా అప్‌‌డేట్

మహేష్ కొత్త సినిమా అప్‌‌డేట్

మహేష్ బాబు కొత్త సినిమా అప్‌‌డేట్స్‌‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు.. సంక్రాంతి సందర్భంగా మూవీ టీమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌‌‌‌ షూటింగ్‌‌ను ఈనెల 18 నుండి  స్టార్ట్ చేయబోతున్నారు. నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని తెలియజేశారు. ‘బుట్టబొమ్మ’ మూవీ ప్రమోషన్స్‌‌లో మాట్లాడిన ఆయన.. మహేష్‌‌ సినిమాకు సంబంధించి మూడు క్రేజీ అప్‌‌డేట్స్‌‌ను రివీల్ చేశారు.

హీరోయిన్స్‌‌గా పూజాహెగ్డే, శ్రీలీల నటించబోతున్నట్టు కన్‌‌ఫర్మ్ చేశారు.  వీరిద్దరిలో ఫస్ట్ హీరోయిన్‌‌, సెకెండ్ హీరోయిన్‌‌ అనే నెంబర్స్ ఏమీ లేవని, ఇద్దరూ మహేష్‌‌కి జంటగా నటిస్తున్నారని చెప్పారు. అంతేకాదు.. ఇంకా టైటిల్ ఏదీ అనుకోలేదని, సినిమాను మాత్రం ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. వీకెండ్‌‌తో పాటు పంద్రాగస్టు సెలవు కూడా కలిసొచ్చేలా పర్ఫెక్ట్‌‌గా రిలీజ్ డేట్‌‌ను ప్లాన్ చేశారు. మరోవైపు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌‌ను నెట్‌‌ ఫ్లిక్స్‌‌ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తవగానే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్‌‌ చేయబోతున్నట్టు నెట్‌‌ ఫ్లిక్స్ సంస్థ తెలియజేసింది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి.