
అనిల్ రావిపూడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్ కు టీమ్ సిద్ధమవుతుంది. మహేష్ బాబు హీరోగా , రష్మీక మందన్నా హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. దాదాపు 13ఏళ్ల విరామం తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
మహర్షి సినిమా తరువాత మహేష్ , ఎఫ్ 2 తరువాత అనిల్ రావిపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఉండేలా డైరక్టర్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని సంక్రాతికి విడుదల చేసేందుకు చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుంది. తాజాగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నట్లు డైరక్టర్ అనిల్ రావిపుడి ట్వీట్ చేశారు. దివాళీకి అభిమానులకు మాంచి ట్రీట్ ఇస్తున్నట్లు చెప్పారు. ట్వీట్ తో పాటు ఓ పోస్టర్ ను పోస్ట్ చేశారు. చదరంగం బోర్డ్ లో కింగ్ ఒక్కడేనంటూ ఓ పిక్ ను షేర్ చేశారు. విలన్ ఇంట్లో షూటింగ్ పూర్తయిందని, చివరి షెడ్యూల్ కోసం టీం సిద్ధంగా ఉందని అనిల్ రావిపుడి పేర్కొన్నాడు.