ఫస్ట్ టైమ్ షర్ట్ లేకుండా బాడీని చూపించిన మహేష్

ఫస్ట్ టైమ్ షర్ట్ లేకుండా బాడీని చూపించిన మహేష్

సినిమాల్లోనైనా, బయటైనా షర్ట్ లేకుండా కనిపించడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అంతగా ఇష్లపడరు. కానీ తమ అభిమాన హీరోని అలా చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు.  ఫ్యాన్స్ డ్రీమ్ను మహేష్ స‌తీమ‌ణి న‌మ్రతా శిరోద్కర్‌ నెరవేర్చారు. మ‌హేష్ స్విమ్మింగ్ చేస్తోన్న ఓ ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో మహేష్  షర్ట్ లెస్‌గా క‌నిపిస్తున్నారు. ఇందులో ఆయ‌న సిక్స్ ప్యాక్ లుక్ క్లియ‌ర్‌గా కనిపిస్తోంది కూడా.  తొలిసారి మహేష్ ష‌ర్ట్ లేకుండా ఉన్న  ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది స‌ర్కారు వారి పాటతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం  త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు.  హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత రాజామూళితో మహేష్  సినిమాని చేయనున్నాడు.