కాళ్ల బేరానికి పాకిస్తాన్.. యుద్ధం నిలువరించేందుకు చర్చలు.. 3 రోజులకే ఫసక్

కాళ్ల బేరానికి పాకిస్తాన్.. యుద్ధం నిలువరించేందుకు చర్చలు.. 3 రోజులకే ఫసక్

దశాబ్ధాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను, వారి శిబిరాలను భారత్ వారం ప్రారంభంలో నేలమట్టం చేయటంతో పాక్ కుతకుతలాడిపోతోంది. గతంలో భారతదేశంలో కీలక దాడులకు ప్లాన్ చేసిన చాలా మంది సీనియర్ ఉగ్రవాదులు, వారి కుటుంబాల్లోని వ్యక్తులు మరణించటం చావుదెబ్బగా పాక్ పరిగణించటంతో కవ్వింపు చర్యలను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియా మిసైళ్లతో దాడులు చేస్తుంటే పాక్ ఆర్మీ మాత్రం నిద్రపోతుందంటూ ఆ దేశంలోని ప్రజలు బాహాటంగానే విమర్శలు గుప్పించటంతో చేసేది లేక యుద్ధం దిశగా పాక్ నడవాల్సి వచ్చింది.

అయితే ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న నిధులు, సైనిక శక్తి, దిగజారిన ఆర్థిక పరిస్థితి, బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు, భూకంపం ఇలా చెప్పుకుంటూ పోతే సర్వ దరిద్రాలు ఒకేసారి పాక్ పై అన్ని వైపుల నుంచి దాడిచేస్తున్నాయి. దీంతో నేడు తెల్లవారుజామున యుద్ధానికి దిగుతున్నట్లు పేర్కొంది. పైగా తమ బలగాలను బోర్డర్ కు తరలించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ భారత్ మాత్రం ఎక్కడా తొట్రుపాటుకు గురికాకుండా అదే స్థాయిలో పాకిస్థాన్ ఉగ్రలాంచ్ ప్యాడ్స్, ఆర్మీ స్థావరాలు, బంకర్లు, ఎయిర్ బేస్ లను టార్గెట్ చేస్తూ నైతికంగా యుద్ధాన్ని ముందుకు తీసుకెళుతోంది. 

ఈ క్రమంలో మేకపోతు గాంభీర్యాన్ని మూడు రోజులుగా ప్రదర్శిస్తూ వచ్చిన పాక్.. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా దిగజారుతున్న పరిస్థితులను సరిదిద్దుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో పాక్ ఇండియాతో దీనికి సంబంధించి చర్చలు జరపటం ద్వారా యుద్ధనష్టాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. అమెరికా కూడా ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం చేసేందుకు ఆసక్తిని కనబరిచిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే ఇండియా పాక్ దేశాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారుల మధ్య మెుదటి ఫోన్ కాల్ జరిగిందని సీఎన్ఎన్-న్యూస్ 18 నివేదించింది. పాక్ పరిస్థితులు పూర్తిగా దిగజారటంతో ఇస్లామాబాద్ నుంచి దిల్లీకి కాల్ వచ్చినట్లు వెల్లడైంది. అలాగే ప్రతినిధుల సమావేశం కోసం రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయని సమాచారం. ఈ క్రమంలోనే యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో దిల్లీతో శత్రుత్వాన్ని తగ్గించుకుంటే మంచిదంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కి గట్టిగా చెప్పారు. భారత ఆర్మీ పరాక్రమం ముందు పాక్ నిలబడలేకపోతోందని నెట్టింట చర్చ కొనసాగుతోంది.