
తెలంగాణ ఈఏపీసెట్ - ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. నేరుగా విద్యార్థుల మొబైల్స్‌కు రిజల్ట్ వచ్చేలా ఏర్పాటు చేశారు. అలాగే వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ( 2025) తెలంగాణ ఈఏపీసెట్ - 2025 పరీక్షలను చూస్తే.... అగ్రికల్చర్ విభాగానికి 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్ చూస్తే.... 2,07,190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఎలా చెక్ చేసుకోవాలంటే..
- తెలంగాణ ఈఏపీసెట్-2025 ఫలితాలకోసం https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి. అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు ర్యాంకులు కూడా తెలుస్తాయి.
- టీజీ ఈఏపీసెట్ రిజల్ట్స్- 2025 లింక్ పై క్లి చేసిన తరువాత ... హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీ ర్యాంక్(మార్కులు) డిస్ ప్లే అవుతుంది.
టీజీ ఈఏపీసెట్-లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ర్యాంక్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫలితాలను ప్రకటించిన తర్వాత…కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. వీటి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు టీజీ ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్-ఫార్మసీ విభాగం పరీక్షలు నిర్వహించగా.. మే 2, 3, 4 తేదీలో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించారు.పరీక్షను నిర్వహించిన జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) EAPCET కమిటీ శుక్రవారం సమావేశాన్ని నిర్వహించి, ఫైనల్ కీ, మరియు ఫలితాల తేదీని ప్రకటించింది.
ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది 73.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఏపీకు చెందిన భరత్ రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా... రెండో ర్యాంకు చరణ్ రెడ్డి.. మూడో ర్యాంకు కార్తీక్ రెడ్డి సాధించారు . ఇక అగ్రికల్చర్ ఫార్మా విభాగంలో 87.82 శాతం ఉత్తీర్ణత కాగా మేడ్చల్ కు చెందిన సాకేత్ రెడ్డిఫస్ట్ ర్యాంకు సాధించారు. రెండో ర్యాంకు కరీంనగర్ కు చెందిన సబ్బాణి లలిత్, మూడో ర్యాంక్ వరంగల్ కు చెందిన చాడ అక్షిత సాధించారు.