
నెల్సన్ కే గఫూర్,మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఫీల్ గుడ్ మూవీ ప్రేమలు. మహా శివరాత్రి (మార్చి 8న) సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది.
ఫిబ్రవరి 9న మళయాలంలో రిలీజై యూత్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసిన ప్రేమలు..తెలుగు ఆడియన్స్కి కూడా సూపర్బ్ గా నచ్చేసింది. కాలేజీ కుర్రాళ్లు ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ చూడటానికి వెళ్తున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మలయాళ డైరెక్టర్ తెలుగు కథాంశంతో తీసిన ఈ చిత్రానికి తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తనదైన శైలిలో స్పందించాడు.
'ప్రేమలు సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. సినిమా కంప్లీట్ అయ్యే వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇలా ఓ సినిమా చూస్తూ చివరిసారి నేను ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదు. మా ఫ్యామిలీ మొత్తానికి ఈ సినిమా బాగా నచ్చింది. అందరు యంగ్‌స్టర్స్ నటన అద్భుతంగా ఉంది. ప్రేమలు టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్..ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఎస్ ఎస్ కార్తికేయకు కృతజ్ఞతలు'అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.ప్రస్తుతం మహేష్ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్ ఎస్ కార్తికేయకు మహేష్ బాబు ట్వీట్కు స్పందిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.'సర్ర్ర్ర్ర్... ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం..మీ ట్వీట్ చూసిన తర్వాత కూడా నా ఉత్సాహాన్ని నియంత్రించుకోలేకపోతున్నాను..మీ కుటుంబం మొత్తం ప్రేమలు సినిమాను ఆస్వాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి ప్రేమలు టీమ్ క్లౌడ్ నైన్‌లో ఉంది...చాలా ధన్యవాదాలు సార్' అంటూ తన హ్యాపీనెస్ను షేర్ చేసుకున్నాడు.
Sirrrrrr… This is a blasting surprise for me… Still can’t control my excitement after seeing your tweet… Spellbound and touched… So glad that the entire family enjoyed the film. The #Premalu team is on cloud nine… Thank you so much sir… ❤️❤️??@SBbySSK @BhavanaStudios… https://t.co/M3eNuoyHxU
— S S Karthikeya (@ssk1122) March 12, 2024
గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ అందించారు. అతడు రాసిన డైలాగ్స్ ట్రెండ్‍కు తగ్గట్టు ఆడియన్స్ ను భలే ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ (SS Karthikeya) దక్కించుకున్న విషయం తెలిసిందే. మలయాళంలో సుమారు రూ.3కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ప్రేమలు మూవీ రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.