Manchu Manoj, Mounika: ఆ వార్తల్లో నిజం లేదు.. భార్య ప్రెగ్నెన్సీపై స్పందించిన మనోజ్

Manchu Manoj, Mounika: ఆ వార్తల్లో నిజం లేదు.. భార్య ప్రెగ్నెన్సీపై స్పందించిన మనోజ్

మంచు మనోజ్(Manchu Manoj) భార్య భూమా మౌనిక(Bhuma Mounika) ప్రస్తుతం గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏడవ నెలల గర్భవతిగా ఉన్న ఆమె మరో రెండు నెలల్లో తల్లికాబోతున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనోజ్, మౌనికకు కవలలు పుట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మంచు ఫ్యామిలీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

అయితే తాజాగా ఇదే విషయంపై నోట్ విడుదల చేశాడు మంచు మనోజ్. మా అభిమానులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం. మీరు మా పట్ల చూపిస్తున్న అమితమైన ప్రేమకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ఒక గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. నా సతీమణి మౌనిక ప్రస్తుతం ఏడవ నెల గర్భవతిగా ఉన్నారు. ఆ భగవంతుని దయ వల్ల తను ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రాబోతున్న బిడ్డ పట్ల ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చేయాలనుకుంటున్నాను. మాకు కవల పిల్లలు పుట్టబోతున్నారు అంటూ బయట వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు.

ఆ విషయంపై సమయం వచ్చినప్పుడు మేము మీతో నేరుగా పంచుకుంటాము, దయచేసి.. బయట వినిపిస్తున్న వార్తలు నమ్మకండి..  ఎల్లప్పుడూ మీరు చూపించే ఆదరాభిమానాలే మాకు శ్రీరామరక్ష.. అంటూ రాసుకొచ్చారు మంచు మనోజ్. ప్రస్తుతం మనోజ్ రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.