
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ప్రాక్టీస్ ఈ రేసింగ్ జరిగింది. అయితే ఈ రేసింగ్ చూడటానికి పలువురు సెలబ్రిటీలు వచ్చారు. మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నమత్ర ఫార్ములా రేసింగ్ హైదరాబాద్ లో జరగడం ఆనందంగా ఉందన్నారు.
మొత్తం 11 జట్ల నుంచి 22 మంది డ్రైవర్లు ఈ ప్రీ రేస్ లో పాల్గొన్నారు. ఇవాళ్టీ ప్రాక్టీస్ రేస్తో రేసర్లకు ఈ ట్రాక్ మీద ఒక అవగాహన రానున్నది. 18 మలుపులతో కూడిన ఈ ట్రాక్ పై ఎలా స్పందిస్తుంది.. కార్లను ఎలా అదుపు చేసుకోవాలి.. ఎక్కడ వేగం పెంచాలి.. వంటి విషయాలపై వారికి స్పష్టమైన అవగాహన కలిగేందుకు ఈ ప్రీ రేసును నిర్వహించనున్నారు.