
- తృటిలో తప్పిన ప్రాణనష్టం ..నాగేపల్లిలో గ్రామస్తుల ధర్నా
పెద్దపల్లి, (రామగిరి), వెలుగు: పెద్దపల్లి జిల్లా ఆర్జీ–3 డివిజన్ ఓసీపీ–2లో గురువారం రెండో షిప్ట్ లో భాగంగా బ్లాస్టింగ్ తో బండరాళ్లు సమీప గ్రామం నాగేపల్లిలోని ఇండ్లపై పడి రేకులు పగిలాయి. పాక్షికంగా దెబ్బతినడంతో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మంథని – పెద్దపల్లి రోడ్డుపై గ్రామస్తులు ధర్నాకు దిగారు.
న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్జీ –3 జీఎం సుధాకర్ రావు వెళ్లి గాయ పడిన బాధితులతో మాట్లాడి నష్టంపోయిన పరిహారం చెల్లిస్తామని, మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సింగరేణి సంస్థ నిర్ణయాలతో స్థానిక ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకాల్సి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ధర్నా సమాచారంతో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ రాజు గౌడ్, రామగిరి ఎస్ఐ చంద్రకుమార్, సిబ్బంది వెళ్లి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.