రైళ్లు, స్టేషన్లలో హ్యూమన్ ట్రాఫికింగ్ అరికట్టాలి : మహేశ్ భగవత్

రైళ్లు, స్టేషన్లలో హ్యూమన్ ట్రాఫికింగ్ అరికట్టాలి : మహేశ్ భగవత్

సికింద్రాబాద్,వెలుగు : రైళ్లు, రైల్వేస్టేషన్లలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రైల్వే అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్ సూచించారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీస్ ఫైల్ ఫార్మేషన్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లకు  సంయుక్తంగా మంగళవారం సికింద్రాబాద్​ సంచాలన్ ​భవన్​లో వర్క్​షాపు నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లో భారతీయ రైల్వే ఒకటని పేర్కొన్నారు.  

రైళ్లలో,  రైల్వే స్టేషన్లలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పూర్తిస్థాయి నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అనంతరం హుమన్​ ట్రాఫికింగ్ పై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సదస్సులో దక్షిణ మధ్య రైల్వే ఐజీ అండ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్, సికింద్రాబాద్​డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేశ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే డీఐజీ అండ్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్  ఎండీ షాదాబ్ ఖాన్,   రైల్వే ఎస్పీ షేక్ సలీమా, సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబష్మిత సి బెనర్జీ పాల్గొన్నారు.