హ్యాపీ బర్త్ డే NSG : మహేష్ బాబు

హ్యాపీ బర్త్ డే NSG : మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్​స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఈ రోజు 51వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు మహేష్ బాబు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. నమ్రతపై తనకున్న ప్రేమను ట్వీట్టర్ ద్వారా చాటుకున్నాడు. "హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్జీ (నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని). నా కోసం అన్ని పనులను ఒక క్రమ పద్ధతిలో పెడుతున్నందుకు ధన్యవాదాలు. అలాగే నన్ను మరింత ముందుకు నడిపిస్తున్నందుకు ఎప్పుడూ నువ్వు లాగానే ఉన్నందుకు థాంక్స్" అంటూ మహేష్ సోషల్ మీడియాలో నమ్రత ఫోటో షేర్ చేశాడు. కాగా, మహేష్ అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు. హ్యాపీ బర్త్ డే నమ్రతా మహేష్ అంటూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. 

ఇక మొదటి సారి ‘వంశీ’ సినిమాలో మహేష్,నమ్రతాలు ఆన్‌ స్క్రీన్‌ జోడీగా చేశారు. అతర్వాత నిజజీవితంలో కూడా ఒక్కటైయ్యారు. 1993లో ఫెమీనా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న నమ్రత 2000లో ‘వంశీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తరువాత ‘అంజి’తో పాటు పలు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించారు. ‘వంశీ’ సినిమా సమయంలో మహేశ్, నమ్రత ప్రేమించుకున్నారు. 2005లో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై ,చెప్పింది. వీరికి గౌతమ్,సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు.