బీజేపీ నేతలు పదవులకోసం.. కులాల మధ్య చిచ్చి పెడుతున్నరు: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్

బీజేపీ నేతలు పదవులకోసం.. కులాల మధ్య చిచ్చి పెడుతున్నరు: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్

బీజేపీ నేతలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  తీవ్ర విమర్శలు  చేశారు. దేశ నిర్మాణంలో మోదీ గానీ, మోదీ కుటుంబం గానీ పనిచేయలేదు..దేశభక్తుడు చెప్పుకుంటున్న సావర్కర్ బ్రిటీష్ వాళ్ల కాళ్ల దగ్గర మోకరిల్లుండు.. అప్పుడు ఇప్పడు ఎప్పుడూ  బీజేపీ నేతలు దేశం కోసం పనిచేయలేదు.. కేవలం పదవులకోసమే మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.

గత బీఆర్ ఎస్ పాలనలో విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రాన్ని అప్పుల  పాలు చేశారని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలనున అమలు చేస్తోందన్నారు. కేవలం దోచుకోవడమే లక్ష్యంగా పనికిరాని కాళేశ్వరం కట్టారని అన్నారు. 

►ALSO READ | రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ట్వీట్

బీఆర్ ఎస్ పాలనలో దొడ్డుబియ్యం స్మగ్లింగ్ చేసి కేసీఆర కుంటుంబం జేబులు నింపుకుందన్నారు మహేష్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకం ద్వారాపేదల కడుపు నింపుతున్నారని అన్నారు. 

ఏప్రిల్ చివరి వారం లోగా అన్ని కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయింది.. మళ్లీ మొలకెత్తదు.. రాష్ట్రంలో బీజేపీయే కాంగ్రెస్ పోటీ అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళితే మళ్లా కాంగ్రెస్ పార్టీ దే అధికారం అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  ధీమా వ్యక్తం చేశారు.