దళారుల ప్రమేయం లేకుండా  సంక్షేమ పథకాల అమలు : మహేశ్వర్ రెడ్డి

దళారుల ప్రమేయం లేకుండా  సంక్షేమ పథకాల అమలు : మహేశ్వర్ రెడ్డి

నిర్మల్/లక్ష్మణచాంద, వెలుగు: సంక్షేమ పథకాల అమలులో దళారుల ప్రమేయం లేకుండా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి పథకానికి సంబంధించి లబ్ధిదారుల నుంచి దళారులు ఇష్టానుసారంగా వాటాలు వసూలు చేశారని ఆరోపించారు. ఇకనుంచి అలాంటి విధానం కొనసాగబోదన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న ప్రతి పథకంలో కేంద్రానిదే పెద్ద వాటా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కల్యాణి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత కళాకారులను ఆదుకోవాలి 

చేనేత కళాకారులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోరారు. స్థానిక ఎమ్మెస్ ఫంక్షన్ హాల్​లో కళాభారతి చేనేత హస్త కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేనేత బట్టల స్టాళ్లను ఆయన ప్రారంభించారు. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానన్నారు.కళాభారతి జిల్లా అధ్యక్షుడు  సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కిషోర్ పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ నూతన భవనాల ప్రారంభంమామడ మండలం కమల్ కోట్, రాయదారి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలను మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోనే రాష్ట్రంలో అనేక  అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీడీఓ రమేశ్, ఎంపీఓ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.