బాలాపూర్ లో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

బాలాపూర్ లో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

 నకిలీ కరెన్సీని తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. బాలాపూర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట దగ్గర అనుమానంగా కనిపించిన నిస్సాన్ కారును ఆపి తనిఖీ చేశారు పోలీసులు. కారులో రూ.25లక్షల నకిలీ కరెన్సీని గుర్తించారు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వచ్చిన నలుగురు సభ్యుల ముఠా.. నిసాన్ కారులో రూ.25 లక్షలు నకిలీ కరెన్సీ తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు.

నిందితులు మూడింతల నకిలీ కరెన్సీ ఇచ్చి.. ఒకింత ఒరిజినల్ కరెన్సీ తీసుకుని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. నిందితులు షేక్ హరుణ్, సయ్యద్ సగీర్, జాకీర్ సయ్యద్, అలీ ఆఫ్తాబ్ అత్తర్ అనే నలుగురు నిందితులను మహారాష్ట్రకు చెందినవారుగా ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. నిందితుల నుండి చిల్ద్రెన్ బ్యాంక్ కు సంబంధించిన రూ.25 లక్షల నకిలీ కరెన్సీ, ఒక కారు, నాలుగు మొబైల్ ఫోన్స్, కీప్యాడ్ మొబైల్, రూ. 8వేల ఒరిజినల్ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్ ఓబటీ పోలీసులు వెల్లడించారు.