Paris Olympics 2024: షాట్ గన్ మిక్సడ్ ఈవెంట్‌.. కాంస్య పతకానికి భారత్ అర్హత

Paris Olympics 2024: షాట్ గన్ మిక్సడ్ ఈవెంట్‌.. కాంస్య పతకానికి భారత్ అర్హత

10 వ రోజు ఒలింపిక్స్ లో భారత్ మంచి ఫలితాలను అందుకుంది. షూటింగ్, టేబుల్ టెన్నిస్ లో అద్భుత విజయాలు సాధించారు. భారత షూటర్లు మహేశ్వరి చౌహాన్ షాట్ గన్ మిక్సడ్ ఈవెంట్ లో 146 క్వాలిఫికేషన్ స్కోర్ తో కాంస్య పతక మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. షాట్ గన్ మిక్సడ్ ఈవెంట్ లో కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత మహిళల టేబుల్ టెన్నిస్ విషయానికి వస్తే టీమ్ శ్రీజ అకుల, మానికా బాత్రా, అర్చన కామత్ రౌండ్ అఫ్ 16 లో జరిగిన ఉత్కంఠ పోరులో రొమేనియాను ఓడించడంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 

ఈ ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు మూడు కాంస్య పతకాలు గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియాకు తొలి మెడల్‌‌‌‌గా బ్రాంజ్‌‌‌‌ అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించారు. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. బ్యాడ్మింటన్ లో లక్ష్య సేన్ కాంస్య పతకం కోసం సోమవారం (ఆగస్ట్ 4) మ్యాచ్ ఆడనున్నాడు.