ఫిల్మ్ మేకర్‌‌‌‌గా అది నా బాధ్యత : మహి వి రాఘవ

ఫిల్మ్ మేకర్‌‌‌‌గా అది నా బాధ్యత : మహి వి రాఘవ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా  నాలుగేళ్ల క్రితం ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన మహి.వి.రాఘవ  దీనికి సీక్వెల్‌‌గా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించాడు. రాజ‌‌శేఖ‌‌ర్ రెడ్డిగా మ‌‌ల‌‌యాళ సూప‌‌ర్ స్టార్ మ‌‌మ్ముట్టి,  జ‌‌గ‌‌న్‌‌ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా న‌‌టించారు. శివ మేక నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది.

సినిమాకొస్తున్న రెస్పాన్స్‌‌ను తెలియజేసిన దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ ‘పొలిటికల్ మూవీ కావడంతో కొందరు నచ్చిందని, మరికొందరు నచ్చలేదని అంటున్నారు. రాజకీయ నాయకుడి కథ కాబట్టి.. భిన్నాభిప్రాయాలు రావడం సహజం. కానీ ఓ స్టోరీ టెల్లర్‌‌గా, నేను అనుకున్న కథ, స్క్రిప్ట్‌‌ను తీశాను.  ఫిల్మ్ మేకర్లుగా సినిమాను తీయడం మా బాధ్యత.  సోమవారం నుంచి రియల్ టాక్ తెలుస్తుంది’ అని చెప్పాడు. ఇక త్వరలోనే ‘సేవ్ ది టైగర్స్ 2’ వెబ్ సిరీస్ రాబోతోందని తెలియజేశాడు.