
రాంచీ: ఐపీఎల్ 2022 కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేశాడు. నెట్స్ లో ప్రతిరోజూ చెమటోడుస్తున్న మహీ మధ్యలో షూటింగ్, టెన్నిస్ కూడా ఆడుతూ రిలాక్స్ అవుతున్నాడు. ధోనీకి ఫుట్‌బాల్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇప్పుడు టెన్నిస్, షూటింగ్ పైనా తనకున్న ప్రేమను తెలియజేస్తున్నాడు. ధోనీ టెన్నిస్ ఆడుతూ, షూటింగ్ రేంజ్‌లో గన్ పట్టి టార్గెట్‌ను గురి పెట్టిన ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ మల్టీ టాలెంటెడ్ మహీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.