అమ్మకానికి థార్ ఎన్‌ఎఫ్‌టీ!

అమ్మకానికి థార్ ఎన్‌ఎఫ్‌టీ!

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం)  నాన్ ఫంగిబుల్ టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎన్ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ) బాట పట్టింది. పాపులర్ కారు బ్రాండ్ థార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీని తీసుకొస్తామని ప్రకటించింది. ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లోకి వస్తున్న మొదటి ఆటో కంపెనీ ఎం అండ్ ఎం కావడం విశేషం. టెక్‌‌‌‌‌‌‌‌ మహీంద్రాతో కలిసి థార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీని ఈ కంపెనీ తీసుకొస్తోంది. వీడియోలు, మ్యూజిక్‌‌‌‌‌‌‌‌, ఫోటోలు, బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు ఏవైనా డిజిటల్‌‌‌‌‌‌‌‌ ఫార్మెట్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ కింద స్టోర్ చేస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ బూమ్ నడుస్తోంది.   టెక్‌‌‌‌‌‌‌‌ మహీంద్రా ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ మార్కెట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌ ‘మహీంద్రా గ్యాలరీ’ లో  నాలుగు ఎన్ఎఫ్‌‌‌‌‌‌‌‌టీలను ఎం అండ్ అమ్మకానికి పెట్టనుంది. ఈ నెల 29 న వీటిని వేలం వేయనున్నారు.  ఈ వేలం ద్వారా వచ్చిన ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను దేశంలో చదువుకి దూరంగా ఉంటున్న ఆడ పిల్లలకు సాయం చేయడానికి  ఖర్చు చేస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది.  డిజిటల్ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీని లాంచ్ చేయడం మరో ఎక్సైటింగ్ ఫేజ్‌‌‌‌‌‌‌‌ అని ఎం అండ్ ఎం (ఆటోమోటివ్‌‌‌‌‌‌‌‌) సీఈఓ విజయ్‌‌‌‌‌‌‌‌ నక్రా ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. తమ కస్టమర్లకు సరికొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ను అందిస్తామని, తమ బ్రాండ్స్‌‌‌‌‌‌‌‌ కోసం కమ్యూనిటీలను క్రియేట్ చేస్తామని అన్నారు. తమ బ్రాండ్‌‌‌‌‌‌‌‌పై అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను, లాయల్టీని పెంచుతామని చెప్పారు. మహీంద్రా బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరించేందుకు ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీలోకి ఎంటర్ అవ్వడం సాయపడుతుందని పేర్కొన్నారు.