Bolero Neo: మార్కెట్లోకి బొలెరో లిమిటెడ్ ఎడిషన్

Bolero Neo: మార్కెట్లోకి బొలెరో లిమిటెడ్ ఎడిషన్

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా & మహీంద్రా.. బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ.11.50 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారును బొలెరో నియో  టాప్ స్పెక్ వేరియంట్ ఎన్10 ఆధారంగా రూపొందించారు. ఇందులో రూఫ్ స్కీరాక్స్, కొత్త ఫాగ్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ ఈడీ డీఆర్ఎల్ లతో కూడిన హెడ్ ల్యాంప్స్, క్యాబిన్ డ్యూయల్ టోన్ లెథెరెట్ సీట్లు తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 

బొలెరో నియోలో 1.5 లీటర్ల ఎంహాక్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఈ వేరియంట్ సిల్వర్, నాపోలీ బ్లాక్, హైవే రెడ్, రాకీ బీజ్, పెరల్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంది. 3750 ఆర్పీఎం వద్ద 100 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 2250 ఆర్పీఎం వద్ద 260 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్ తో పనిచేస్తుంది.