మాషా అమినీకి ఈయూ అవార్డు

మాషా అమినీకి ఈయూ అవార్డు

స్ట్రాస్‌‌బర్గ్‌‌: ఇరాన్ లో హిజాబ్‌‌ ధరించలేదని అరెస్ట్‌‌యి, పోలీసు కస్టడీలో మృతి చెందిన కుర్దీష్‌‌ ఇరానీయన్‌‌ యువతి మాషా అమినీ (22)కి మరణాంతరం యూరోపియన్‌‌ యూనియన్‌‌ (ఈయూ)  మానవ హక్కుల అవార్డు  ‘సాఖరోవ్‌‌ ప్రైజ్‌‌’కు ఎంపికైంది. హిజాబ్‌‌ ధరించలేదని మొరాలిటీ పోలీసులు అమినీని అరెస్ట్‌‌ చేసి, కొట్టారు. దీంతో ఆమె 2022 సెప్టెంబర్‌‌‌‌ 16న చనిపోయింది. 

అయితే, అమినీ హార్ట్‌‌ అటాక్‌‌తో చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. దీంతో దేశమంతా ఆందోళనలు చెలరేగాయి. కాల్పుల్లో 500 మంది మరణించగా, 22 వేల మంది అరెస్ట్‌‌ అయ్యారు. కాగా, నిరసనలకు నేతృత్వం వహించిన కుర్దిష్‌‌ మహిళా హక్కుల కార్యకర్త నర్గీస్‌‌ మొహమ్మదీకి ఇటీవల నోబెల్‌‌ శాంతి బహుమతి వచ్చింది.