
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రాల పర్యటనలు తగ్గించి న ప్రధాని నరేంద్ర మోడీ, సోష ల్ మీడియా వేదికగా సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘మై భీ చౌకీదార్(నేను కూడా కాపలాదారునే) ’అని ప్రతిజ్ఞ చేయాల్సిందిగా మద్దతుదారులను కోరుతూ శనివారం ఓ రాక్ సాంగ్ ను విడుదల చేశారు. దాంతోపాటు ‘‘మీ చౌకీదార్ ధృఢంగా నిలబడి దేశసేవ చేస్తున్నాడు. అయితే నేను ఒంటరినికాను. అవినీతికి, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్క భారతీయుడూ ఒక చౌకీదారే. దేశ పురోగతి కోసం కష్టపడే అందరూ చౌకీదార్లే. ‘మై భీ చౌకీదార్’ ప్రతిజ్ఞకు అర్థమిదే”అని ప్రకటన కూడా చేశారు. ఈ ప్రచారానికి సంబంధించి మార్చి 31న భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రధాని కొత్త ప్రచారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. శనివారం ట్వి టర్ లో ‘మై భీ చౌకీదార్ ’ హ్యాష్ ట్యాగ్ టాప్ వరల్డ్ వైడ్ ట్రెండ్ గా నిలవడం విశేషం. 2014 ఎన్ని కల ప్రచారంలో మోడీ తాను గెలిస్తే దేశానికి కాపలాదారు(చౌకీదార్ )గా ఉంటానడంతో ఆ పదం పాపులరైన సంగతి తెలిసిందే. రాఫెల్ యుద్ధవిమానాల కుంభకోణంలో పీఎంవో పాత్రను నిర్ధారించే ఆధారాలు బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ ‘చౌకీదార్ హి చోర్ హై(చౌకీదారే దొంగ)’ అంటూ మోడీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది.
కోడ్ ఉల్లంఘించారా?
మోడీ ఉపన్యాసం బిట్ వీడియోతో మొదలయ్యే 3:45 నిమిషాల ‘మై భీ చౌకీదార్ ’ పాటలో ప్రభుత్వ పథకాల గొప్పదనాన్ని వివరించారు. వాటికితోడు మోడీ కే9వజ్రా యుద్ధ ట్యాంకు ఎక్కినప్పటి దృశ్యాలు, సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రతిబింబించేలా ఆర్మీ ఆపరేషన్స్‌ను పాటలో పొందుపర్చడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వరాదని ఎన్నికల కోడ్ చెబుతుండగా, ఆర్మీ ఆపరేష న్స్ను రాజకీయ లబ్ధికి వాడుకోరాదంటూ ఈసీ, సుప్రీంకోర్టులు ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిం దే. కోడ్ ధిక్కరణ, కోర్డు ఆదేశాల బేఖాతరుపై బీజేపీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
సూట్ బూట్ కా చౌకీదార్ !
మోడీ ‘మై భీ చౌకీదార్ ’ క్యాంపెయిన్ను ప్రారంభించి న కొద్ది సేపటికే ట్వి టర్ లో ఆ హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండ్ లోకి వెళ్లిం ది. దానిని కౌంటర్ చేస్తూ, మోడీ కేవలం బడాబాబులకు మాత్రమే కాపాలదారుడు (సూట్ బూట్ కా చౌకీదార్ ) అంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది. మోడీని మళ్లీ నమ్మడానికి ఇండియా బేవకూఫ్ కాదంటూ రిటార్ట్ ఇచ్చింది. అపరాధభావంతో మోడీ ఆత్మరక్షణలో పడ్డారని, కాబట్టే నిందను ప్రజలపైనా మోపడానికి ‘మై భీ చౌకీదార్’ పల్లవి అందుకున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్థికనేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీ, అనిల్ అంబానీ, విజయ్‌మాల్యా, మెహుల్ చోక్సీ తదితరులతో మోడీ ఫొటోను జతచేసి రాహుల్ ఓ ట్వీట్ చేశారు.