సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంటామన్న చైనా

సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంటామన్న చైనా

భారత్, చైనా దేశాలు మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల రెండు దేశాలకు చాలా ప్రయోజనాలు కలుగుతాయని డ్రాగన్ కంట్రీ రక్షణ శాఖ మంత్రి జనరల్ వీ ఫెంఘే తెలిపారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట శాంతి కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. సింగపూర్ లోని షాంగ్రీలా డైలాగ్ లో ప్రసంగించిన చైనా రక్షణ మంత్రి..దక్షిణ చైనా సముద్రంతో సహా సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. భారత్ తో శాంతి కోసం తాము 15సార్లు ఆదేశ సైనిక కమాండర్ స్థాయి అధికారులతో చర్చలు జరిపామన్నారు. సరిహద్దు ప్రాంతంలో శాంతి కోసం భారత్ తో కలిసి పనిచేస్తామని చెప్పారు. చైనా భారతదేశంతో సరిహద్దు ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు,నివాస యూనిట్లు వంటి ఇతర మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోంది. మరోవైపు చైనా రక్షణ మంత్రి మాత్రం సరిహద్దు వివాదంపై భారత్ తోశాంతియుతంగా పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. డ్రాగన్ కంట్రీ చెప్పేది ఒకటి చేసేది మరొకటి. అందుకే చైనా మాటలను ఎవరూ నమ్మరు.