ఆరేళ్లలో రూ.600 కోట్లు లూటీ

ఆరేళ్లలో రూ.600 కోట్లు లూటీ

వ్యాపారులు సిండికేట్గా మారి మార్క్ ఫెడ్ ను దోచు కుంటున్నారు. ఏటా మక్కల అమ్మకాల టైంలో లూటీ చేస్తున్నారు. తక్కువ ధరకు టెండర్లు కోట్ చేసి.. ఆరేండ్లలో దాదాపు రూ. 600 కోట్లుకొల్లగొట్టారు. ఈ విషయం  ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదన్నవిమర్శలు వస్తున్నాయి. వ్యాపారుల సిండికేట్ వ్యవహారం వెనుక టీఆర్ఎస్ లోని కీలక నేతల హస్తం ఉన్నట్లు మార్క్ ఫెడ్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

పట్టించుకోని సర్కార్

ప్రభుత్వం తన పరిధిలోని సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. నష్టా ల ఊబిలోని సంస్థ లను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. కానీ మార్క్ ఫెడ్ సంస్థ విషయంలో అవేవీ జరగడం లేదు. ఒక ఏడాది నష్టాలు వస్తేవెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాల్సి ఉండగా.. ఆరేండ్లుగా మార్క్ ఫెడ్  ఏటా వందల కోట్ల నష్టా లు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. వ్యాపారులు సిండికేటై తక్కువ ధర కోట్ చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై మార్క్ఫెడ్ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దోపిడీ ఇట్లా..

రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతుల నుంచి మక్కలను మార్క్ ఫెడ్ ద్వారా సేకరిస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వాటిని కొనుగోలు చేస్తుంటుంది. ఇలా కొనుగోలు చేసిన మక్కలను టెండర్ల ద్వారా మార్క్ ఫెడ్ అమ్మేస్తుంటుంది. టెండర్లలో గొనే వ్యాపారులు సిండికేట్గా మారి ఏటా తక్కువ ధర కోట్ చేస్తున్నారు. రైతుల నుంచి మార్క్ ఫెడ్ ను కొనుగోలు చేసిన ధర కంటే క్వింటాల్కు ఐదారు వందలు తక్కువకు కోట్ చేస్తున్నారు. దీంతో ఏటా వందల కోట్లు మార్క్ ఫెడ్  నష్టాలు వస్తున్నాయి.మక్కలను ఎక్కువ కాలం స్టోర్ చేయలేని పరిస్థితి ఉందని, అందుకే తక్కువకైనా అమ్మేయాల్సి వస్తోందని మార్క్ ఫెడ్ వర్గాలు అంటున్నాయి.

తక్కువ ధర కోట్ చేశారని టెండర్లు రద్దు చేస్తే..!

ఈ మధ్య జరిగిన టెండర్లలో  వ్యాపారులు కోట్ చేసిన ధర ఆఫీసర్లను షాక్కు గురిచేసింది. ఈ ఏడాది రైతుల నుంచి మార్క్ ఫెడ్ మక్కలను క్వింటాల్ కు  రూ . 1 760తో కొన్నది. ఇందులో 69 ,431 టన్నులను అమ్మేందుకు మార్క్ ఫెడ్ టెండర్లు పిలిచింది. క్వింటాల్ కు రూ. 1,188 ధరను వ్యాపారులు కోట్ చేశారు. తక్కువ ధర వచ్చిందన్న కారణంతో సంస్థ టెండర్లను రద్దు చేసింది. మళ్లీ టెండర్లను పిలిస్తే రూ. 1107.90 కోట్ చేశారు. ఈ ధరకు మక్కలను అమ్మితే దాదాపు రూ. 70 కోట్ల నష్టం వస్తుందని ఆఫీసర్లు అంటున్నారు.

వ్యాపారుల వెనుక టీఆర్ఎస్ లీడర్స్?

మార్క్ఫెడ్ నుంచి మక్కలను కొనే వ్యాపారుల వెనుక టీఆర్ఎస్ లోని కీలక నేతలు ఉ న్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఏటా మార్క్ ఫెడ్ సంస్థను దర్జాగా వాళ్లు కొల్లగొడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మార్క్ ఫెడ్ టెండర్లు పిలిచిన వెంటనే మక్కలను కొనుగోలు చేసే వ్యాపారులు టీఆర్ఎస్ కీలక నేతలను కలిసి, వారు చెప్పిన రేటుకు టెండర్లు వేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పౌల్ట్రీరంగానికి మక్కలు ఎక్కువ అవసరం. అధికార పార్టీలోని ర్టీ పౌల్ట్రీ వ్యాపారస్తులు కూడా సిండికేటై తక్కువ ధరను కోట్ చేస్తునట్టు విమర్శలు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ లీడర్ల తీరు వల్లే మార్క్ ఫెడ్ సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్తోందన్న చర్చ జరుగుతోంది. ఏటా దోపిడీనే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరేండ్లలో మార్క్ ఫెడ్ ను వ్యాపారులు దాదాపు రూ.600 కోట్ల వరకు ముంచేశారు. వ్యాపారులంతా కుమ్మక్కయి తక్కువ ధరకు టెండర్లను కోట్ చేయడంతో 2014 – 15 రబీ సీజన్ లో రూ. 155 కోట్లు, 2017-–18 ఖరీఫ్ సీజన్లో రూ. 140 కోట్లు, 2017-–18 రబీ సీజన్లో రూ. 111 కోట్లు, 2018–-19 ఖరీఫ్ సీజన్లో రూ. 127 కోట్లు, 2019-–20 ఖరీఫ్ సీజన్ లో రూ. 80 కోట్లదాకా మార్క్ ఫెడ్ లాస్ వచ్చింది.