వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. మరుగుతున్న లిక్విడ్ స్టీల్ కార్మికుల మీద పడటంతో..

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. మరుగుతున్న లిక్విడ్ స్టీల్ కార్మికుల మీద పడటంతో..

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS-2 విభాగంలో ప్రమాదం జరిగింది. ల్యాడిల్‌ నుంచి హాట్‌ మెటల్ బకెట్లు కుప్పకూలాయి. పెద్ద మొత్తంలో ద్రవం పడటంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్టు తెలిసింది.

మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్లలో ఈ హాట్ మెటల్ బకెట్లను ఎక్కువగా వాడతారు. కరిగిన ద్రవ రూపంలో ఉన్న వేడి ఇనుము లేదా ఉక్కును ఒక చోటు నుంచి మరో చోటుకు రవాణా చేయడానికి ఈ హాట్ మెటల్ బకెట్లను వాడతారు. వీటిని లాడిల్స్ (Ladles) అని పిలుస్తారు. 

►ALSO READ | ఇసుకలో BRS నేతలు కోట్లు దోసుకున్నరు.. ఇప్పుడు సర్కార్ ఆదాయం పెరిగింది

ఇవి 1500° C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ద్రవ ఇనుమును నిల్వ చేయడానికి, తరలించడానికి ఉపయోగపడతాయి. వీటి సైజ్ 1 టన్ను నుంచి 85 టన్నుల వరకు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో ఉంటాయి. బ్లాస్ట్ ఫర్నేస్లో కరిగిన ముడి ఇనుమును స్టీల్ మెల్టింగ్ షాప్ (SMS) కు లేదా కాస్టింగ్ ప్లాంట్ (Casting Plant) కు తరలించడానికి ఈ భారీ బకెట్లను స్టీల్ ప్లాంట్లలో వాడతారు. వీటిని తరలించే సందర్భంలో ఏమైనా తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదం. ద్రవ రూపంలో ఉండే కాలే కాలే ఇనుము మీద పడితే ప్రాణాలకే ముప్పు.

స్టీల్ ప్లాంట్లలో కార్మికులు చాలా జాగ్రత్తగా హాట్ మెటల్ బకెట్లలో ఉక్కును తరలిస్తుంటారు. దురదృష్టవశాత్తూ.. జూన్ 8న విశాఖ స్టీల్ ప్లాంట్లో ల్యాడిల్‌ నుంచి హాట్‌మెంట్‌ బకెట్లు కుప్పకూలి పెద్దమొత్తంలో ద్రవం మీద పడటంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరు మృతి చెందినట్లు తెలిసింది.