- 40 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం
- సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఘటన
జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్ లో రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో 40 మంది విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం విద్యార్థులను తీసుకొని స్కూలుకు వెళ్తుండగా బీదర్ క్రాస్ రోడ్డు వద్ద బస్సులోంచి పొగలు రావడం చూసి డ్రైవర్ అప్రమత్తమై నిలిపేశాడు.
విద్యార్థులను క్షేమంగా దింపేశారు. పొగలు వచ్చిన ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు నీళ్లను తెచ్చి ఆర్పేశారు. డ్రైవర్ అప్రమత్తతతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. డ్రైవర్ సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడారు.
