తిరుమల ఘాట్‌ రోడ్డులో తప్పిన ప్రమాదం! తుఫాన్ గాలులకు కూలిన భారీ వృక్షం..

తిరుమల ఘాట్‌ రోడ్డులో తప్పిన ప్రమాదం! తుఫాన్ గాలులకు కూలిన భారీ వృక్షం..

తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి మోంథా  తుఫాను కారణంగా బలమైన గాలుల ధాటికి ఓ భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. ఈ ఘటన వల్ల ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తిరుమల నుండి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని 14వ మలుపు వద్ద ఈ సంఘటన జరిగింది. బలమైన గాలుల కారణంగా ఈ వృక్షం వేళ్లతో సహా కూలి రోడ్డుపై పడిపోయింది.

అయితే, ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఈ మార్గంలో చెట్టు కూలిన సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడం వల్ల  ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదు. 

దీనికి సంబంధించి సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్, విజిలెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే చర్యలు చేపట్టి  చెట్టును తొలగించారు.