
తిరుమలలో పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం(ఆగస్టు26) ) మధ్యాహ్నం తిరుమల ఎంబీసీ సమీపంలో పెద్ద చెట్టు ఒక్కసారిగా నేలకూలింది.ఈ ప్రమాదంలో టీటీడీ ప్రైవేట్ భద్రతా సిబ్బంది చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గార్డును చికిత్స కోసం వెంటనే అశ్వినీ ఆస్పత్రికి తరలించారు.
ఘటన జరిగినప్పుడు చెట్టుకు సమీపంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం జరగలేదు. చెట్టు పడిన సందర్భంలో భారీ శబ్దం రావడంతో భక్తులు, సిబ్బంది ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు.
సంఘటన సమాచారం అందుకున్న వెంటనే విజిలెన్స్ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కూలిపోయిన చెట్టు భాగాలను తొలగింపు పనుుల చేపట్టారు. భక్తుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
►ALSO READ | తిరుమల లడ్డు ప్రసాదం అమ్మకాల్లో ఆల్ టైం రికార్డ్.. ఒక్కరోజులోనే..